ది కేరళ స్టొరీ ఒక అందమైన దయ్యం.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్

ది కేరళ స్టొరీ ఒక అందమైన దయ్యం.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ది కేరళ స్టొరీ పై వరుస ట్వీట్స్ చేసాడు. ది కేరళ స్టోరీ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ పై వరుస ట్వీట్స్ సంధించాడు.. "ఇతరులకు అబద్ధాలు చెప్పుకోవడంలో మనం ఎంత హాయిగా ఉంటామో, మనకు ఎవరైనా నిజం చూపిస్తే షాక్ అవుతాం. 

ఇప్పుడు ది కేరళ స్టోరీ సక్సెస్ పై బాలీవుడ్ అలాగే సైలెంట్ గా ఉంది. ది కేరళ స్టోరీ సినిమా బాలీవుడ్ అగ్లీనెస్ ని చూపించే ఓ అందమైన దయ్యం లాంటిది. ఇప్పుడు బాలీవుడ్ ప్రతి స్టోరీ డిస్కషన్ రూమ్ లో.. ది కేరళ స్టోరీ సినిమా వాళ్ళను వెంటాడుతుంది. ది కేరళ స్టోరీ సినిమాను చూసి బాలీవుడ్ నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే అబద్దాన్ని ఎవరైనా ఈజీగా కాపీ చేయొచ్చు, కానీ నిజాన్ని కాపీ చేయడం కష్టం అని రాశారు. దీంతో ఆర్జీవీ ది కేరళ స్టోరీ సినిమాను పొగుడుతూ చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 ఇక కేరళలో కొంతమంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో తెరకెక్కించిన సినిమా ది కేరళ స్టోరీ. అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితాముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను.. సుదీప్తో సేన్ తెరకెక్కించారు. మే 5న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కొన్ని చోట్ల ఆందోళనలు జరిగినా.. మౌత్ టాక్ తో మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటివరకు 180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.