Vyooham Movie: వ్యూహం రిలీజ్ ఉందా? లేదా? అసలు ఏం జరుగుతోంది?

Vyooham Movie:  వ్యూహం రిలీజ్ ఉందా? లేదా? అసలు ఏం జరుగుతోంది?

వ్యూహం..వ్యూహం..వ్యూహం..ఇప్పుడు రాజకీయా నాయకుల్లో..సినీ ప్రేక్షకుల్లో వినిపిస్తోన్న సినిమా. ఈ సినిమా రిలీజ్ అయితే..ప్రమాదమని ఓ వైపు..ఒక వర్గం రాజకీయా నాయకులకు..ఎప్పుడెప్పుడా చూడాలని సినీ ఫ్యాన్స్ కు..ఇలా అందర్నీ తల కిందులు చేస్తూ వస్తున్న సినిమా ఇది.

ప్రస్తుతం వ్యూహం సినిమాపై జరుగుతున్న దాడులు..నిరసనలు..కామెంట్స్..ఇలా హాట్ టాపిక్గా మారాయి. దీంతో రేపు డిసెంబర్ 29న వ్యూహం (Vyooham) రిలీజ్ ఉందా..? లేదా? అసలు ఏం జరుగుతోంది? 

అయితే, వ్యూహం సినిమా వాయిదా పడినట్టు సమాచారం. ఇప్పటికే వాయిదా పడి..కొత్త రిలీజ్ డేట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా తన వ్యూహాలతో డిసెంబర్ 29 కి పట్టుకొచ్చారు వర్మ. మళ్ళీ ఇంకోసారి వాయిదా అంటే..వర్మ ఫ్యాన్స్ తో పాటు..సినిమా ఫ్యాన్స్ కూడా అయోమయంలో పడ్డారు.

also read : Vyooham Issue: చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.. వర్మకు మద్దతుగా విద్యార్థి యువజన JAC

ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు నిరవధిక వాయిదా మాత్రమే అని అంటున్నారు. మళ్లీ కొన్ని రోజులు అయ్యాక విడుదల చేస్తారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే సంక్రాంతి పండుగ తర్వాతే ఉండొచ్చని అంటున్నారు సినీ క్రిటిక్స్. మరి ఇప్పుడు వాయిదా పడటానికి అసలు కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.

అసలు విషయానికి వస్తే..

ప్రస్తుతం ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది. అంతేకాకుండా వ్యూహం’ సినిమా‌కు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని..అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో ఉండటం..దీనిపై ఇవాళ డిసెంబర్ 28న హైకోర్టులో ఇరువర్గాలు వాదనలు కూడా వినిపించాయి. ఇప్పటివరకు రిలీజ్ అవుతుందా..లేదా అనే విషయంపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు.

చివరికి కోర్టు తీర్పు ఎలా ఉన్నా..రేపు (డిసెంబర్ 29) మాత్రం వ్యూహం రిలీజ్ లేకపోవొచ్చని తెలుస్తోంది.ఇందుకు కారణం లేకపోలేదు..భారీ అంచనాలు..భారీ వ్యూహాలు ఉన్న ఈ సినిమాకు థియేటర్లు దొరకకపోవడమే..రిలీజ్ పోస్ట్ఫోన్కు కారణం అని సమాచారం.మరి ఏమవుతుందో చూడాలి. 

వ్యూహం వివాదం:

ఈ సినిమాలో తీసుకున్న కంటెంట్..ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం, ఈ చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడంపై కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులపై చూపించకూడని అ వాస్తవ సంఘటనలు..ఇలా ఎలా చిత్రీకరించి..సినిమాలు చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఇదంతా తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అభూత కల్పనలతో వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, రిలీజ్ పై మేకర్స్ స్పందించాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ఇక రేపు (డిసెంబర్ 29) సినిమాల విషయానికి వస్తే..కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్, సుమ కొడుకు డెబ్యూ మూవీ బబుల్‌గమ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా చాలా థియేటర్లలో ప్రభాస్ సలార్ రన్ అవుతోంది.