Vyooham Issue: చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.. వర్మకు మద్దతుగా విద్యార్థి యువజన JAC

Vyooham Issue: చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.. వర్మకు మద్దతుగా విద్యార్థి యువజన JAC

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహం పోస్ట్ఫోన్ అవ్వగా..ఈ నెల డిసెంబర్ 29న రిలీజ్ డేట్తో రెడీగా ఉంది.

ప్రస్తుతం వ్యూహం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నాలు చేస్తూ..సినిమా రిలీజ్ని ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

రీసెంట్గా శ్రీనివాసరావు ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీజీ తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని టీవీ షో డిబేట్లో కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దీంతో వర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు  ఫిర్యాదు చేయడం..చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని కోరడం తెలిసిందే.

 

ఇదిలా ఉంచితే..లేటెస్ట్గా రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ ఆసక్తిగా మారింది. TV 5 కాంట్రాక్ట్ కిల్లర్స్ సమస్యపై..JAC ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ DGPకి లేఖ రాసినట్లు చెబుతూ...వారికి థ్యాంక్స్ అంటూ పోస్ట్లో తెలిపారు.

also read : Vyooham Movie: వ్యూహం రిలీజ్ ఉందా? లేదా? అసలు ఏం జరుగుతోంది?

విద్యార్థి యువజన JAC ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాసిన లేఖలో..'రాంగోపాల్ వర్మ ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలను తెరకెక్కించారని..వాటి ద్వారా అన్ని రకాల అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆయన సినిమాలతో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని జాతీయస్థాయిలో నిరూపించుకున్నారని..బాలీవుడ్కు రాంగోపాల్ వర్మ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఒక ట్రెండ్ సెట్టర్గా సినీ రంగంలో రాంగోపాల్ వర్మ నిలుస్తారని విద్యార్థి యువజన JAC అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే..ఆయన చిత్రాలపై అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు..కానీ హింసకు ప్రేరేపించేలా హత్యకు పిలుపునివ్వటం సభ్య సమాజం తలదించుకునే పని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ'..వర్మకు మద్దతుగా విద్యార్థి యువజన JAC లేఖలో వివరించే ప్రయత్నం చేశారు.