రామ్ – బోయపాటి మూవీ లేటెస్ట్ అప్డేట్

రామ్ – బోయపాటి మూవీ లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ యంగ్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) ఒక మాస్ మసాలా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ మైసూర్ లో ప్రారంభం కానుంది. కాగా ఈ షెడ్యూల్ లో సాంగ్ ను షూట్ చేయనున్నారు మేకర్స్. 

శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి(Sinivasa Chitturi) నిర్మిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ థమన్(Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది.