
రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కి ఇది సీక్వెల్. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న సినిమాని విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. రిలీజ్‌కు 50 రోజులు ఉండడంతో కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్
చార్ట్ బస్టర్ అవబోతోందని, అలాగే రామ్ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో విజువల్ ట్రీట్‌గా ఈ పాట ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. రామ్‌కు జంటగా కావ్య థాపర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.