రామ్ పోతినేని హీరోగా తెలుగులో బిజీగా ఉంటూనే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల రివీల్ చేయగా, తాజాగా తనకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విమానంలో టర్బులెన్స్ హెచ్చరికతో ప్రారంభమయ్యే ఈ గ్లింప్స్‌లో రజినీకాంత్ గన్ విసరగా, రామ్ స్టైలిష్‌గా అందుకోవడం హైలైట్‌గా నిలిచింది.
గడ్డం, కళ్లద్దాలతో మాస్ లుక్‌లో కనిపించిన రామ్ తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. అశ్వత్ మారిముత్తు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని మేకర్స్ తెలియజేశారు.
