జ్యోతినగర్,వెలుగు: కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం రామగుండం జామ మస్జీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో కేకే మహేందర్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గురువారం పందిర్ల సుధాకర్ గౌడ్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతోపాటు గొల్లపల్లి కో ఆప్షన్ మెంబర్ జబ్బర్, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.