బీసీలంతా ఐక్యంగా పోరాడాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

బీసీలంతా ఐక్యంగా పోరాడాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​రాజ్​ఠాకూర్​ సూచించారు. గురువారం గోదావరిఖని మెయిన్​ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బంద్​కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

అవయవ దాతల కుటుంబాలకు సన్మానం

మరణానంతరం ప్రతిఒక్కరూ అవయవదానం చేసేలా చట్టం రూపొందించేందుకు అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ తెలిపారు. గోదావరిఖనిలోని సిమ్స్ మెడికల్ కాలేజీలో గురువారం సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ 17 ఏండ్లుగా అవయవ, శరీర, నేత్ర దానంపై విశేష కృషి చేస్తూ, ఎందరో బాధితుల్లో వెలుగులు నింపుతోందన్నారు.

 తన తమ్ముడు శైలేందర్ గుండెపోటుతో మరణిస్తే, కుటుంబ సభ్యులను ఒప్పించి, అతని నేత్రాలను దానం చేసినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. అనంతరం అవయవదాత కుటుంబ సభ్యులను సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలు డాక్టర్ అరుణ, డాక్టర్ శశికాంత్ కిరాగి, డాక్టర్ రణధీర్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి.శ్యామ్ సుందర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రమోద్ కుమార్ రెడ్డి, పి.మల్లికార్జున్, కె.రాజేందర్​, తదితరులు పాల్గొన్నారు.