వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభం

వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండల పరిధి ముచ్చింతల్‌‌‌‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి. జీయర్‌‌‌‌ ఆస్పత్రి నుంచి యాగశాల వరకు నిర్వహించిన శోభాయాత్రలో త్రిదండి రామానుజ చినజీయర్‌‌‌‌ స్వామితోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు స్వామీజీలు, వేలాది మంది వలంటీర్లు పాల్గొన్నారు.  ఫిబ్రవరి 14 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. లక్ష్మీనారాయణ మహాయజ్ఞం, 108 దివ్యదేశాల ప్రతిష్ట, కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈనెల 5న ప్రధాని మోడీ, 7న రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌, 8న అమిత్‌‌‌‌ షా, 13న రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ రానున్నారు.