ఎన్టీపీసీ తెలంగాణ సెక్యూరిటీ కాంప్లెక్స్‌‌‌‌ ప్రారంభం

ఎన్టీపీసీ తెలంగాణ  సెక్యూరిటీ కాంప్లెక్స్‌‌‌‌ ప్రారంభం

జ్యోతి నగర్, వెలుగు: ఎన్టీపీసీ మాజీ డైరెక్టర్, కేంద్రీయ విద్యుత్ నియంత్రణ కమిషన్‌‌‌‌ (సీఈఆర్‌‌‌‌సీ) సభ్యుడు రమేశ్‌‌‌‌బాబు శనివారం రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌‌‌‌ను సందర్శించారు. ఆయనకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)  చందన్ కుమార్ సమంత పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 

అనంతరం కొత్తగా నిర్మించిన తెలంగాణ సెక్యూరిటీ కాంప్లెక్స్‌‌‌‌ను రమేశ్‌‌‌‌బాబు ప్రారంభించారు. సందర్శనలో భాగంగా ఆయన తెలంగాణ స్విచ్‌‌‌‌యార్డ్, తెలంగాణ ప్లాంట్, 176 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌‌‌‌ను పరిశీలించారు. అలాగే మియావాకి తోటను కూడా సందర్శించారు.