
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. దాయాదుల పోరును చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండు టీమ్స్ త్వరలో షురూ కాబోయే టీ20 వన్డే వరల్డ్ కప్‌లో ఒకదాంతో మరొకటి తలపడనున్నాయి. ఈ నెల 24న జరిగే కప్ ఆరంభ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు భీకరంగా పోరాడతాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటివరకు వరల్డ్ కప్ మ్యాచుల్లో భారత్‌పై ఒక్క మ్యాచులోనూ గెలవని చెత్త రికార్డు పాక్‌కు ఉంది. ఎలాగైనా టీమిండియాను ఓడించాలనే పట్టుదలతో దాయాది గ్రౌండ్‌లోకి దిగనుంది. అందుకే పాక్ ప్లేయర్లను ప్రోత్సహిస్తూ ఓ వ్యాపారవేత్త బంఫర్ ఆఫర్ ఇచ్చాడట. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను ఓడిస్తే పాక్ ప్లేయర్లకు బ్లాంక్ చెక్ ఇస్తానని ఓ ఇన్వెస్టర్ తమకు హామీ ఇచ్చారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించారు.