ల్యాబ్​కు మోకాళ్ల నొప్పుల మందు

ల్యాబ్​కు మోకాళ్ల నొప్పుల మందు

కొత్తకోట, వెలుగు: పట్టణానికి  చెందిన నాటు వైద్యుడు రాములు నిర్వహిస్తున్న శ్రీ ధన్వంతరి సాయిరాం ఆయుర్వేద మోకాళ్ల నొప్పులకు ఇచ్చే మందులను ఆయూష్​ డిపార్ట్​మెంట్​ డిప్యూటీ డైరెక్టర్  హేమలత పరిశీలించారు. రాములు తయారు చేసే మందును టెస్టింగ్​ కోసం తీసుకెళ్లారు. రిపోర్ట్​ వచ్చేంత వరకు ఎలాంటి మందులు అమ్మవద్దని సూచించారు. రాములు నడుపుతున్న క్లినిక్​ను సీజ్​ చేశారు. టెస్టింగ్​కు పంపిన మందుపై రిపోర్ట్​ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. డీఎంహెచ్​వో జయచంద్ర, జె మధు పాల్గొన్నారు.