
‘బాహుబలి’తో ప్యాన్ఇండియా రేంజ్లో పాపులర్ అయ్యింది సీనియర్ నటి రమ్యకృష్ణ(Ramya Krishna). ఇటీవల విడుదలైన ‘జైలర్’(Jailer) సినిమాతో మరోసారి ఆమె పేరు వినిపిస్తోంది. ఒక సాధారణ గృహిణి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి ఇటీవల ఓఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది.
తన సినీ కెరీర్‌పై నమ్మకం సన్నగిల్లుతున్న టైంలో తెలుగు పరిశ్రమే తనను స్టార్ హీరోయిన్ను చేసిందని తెలిపింది. 1988లో నేను చేసిన ‘ముదల్ వసంతం’అనే ఓ తమిళ సినిమాను తన తల్లి ఇటీవల చూసినట్టు తెలిపింది. ఇలాంటి నటనతో నువ్వు ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా ఉండగలిగావని ఆమె ఆశ్చర్యపోయిందన్నారు.
అప్పట్లో తన యాక్టింగ్ స్కిల్స్ అలా ఉండేవని చెప్పింది. తమిళ సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో తెలుగు పరిశ్రమలోకి వచ్చిన రమ్య.. తన నటనను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చినట్టు వివరించింది.