రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శ్రీచైతన్య స్కూల్ సీజ్.. ఎందుకంటే..!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శ్రీచైతన్య స్కూల్ సీజ్.. ఎందుకంటే..!

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య స్కూల్​ను అధికారులు సోమవారం సీజ్ చేశారు. గత కొన్నేండ్లుగా మంచాల రోడ్డులోని భారత్ పెట్రోల్ పంప్ ప్రహరీ గోడను ఆనుకొని స్కూల్ ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో జిల్లా విద్యాధికారి 2024లోనే పాఠశాలను సీజ్ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారని, అందులో బాగంగానే స్కూల్​ను సీజ్​ చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎంఇవో హీర్యా నాయక్ తెలిపారు. స్కూల్​సీజ్ చెయ్యడంతో విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు సమాచారం.