రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‌‌లిఫ్ట్@94.30 లక్షలు

రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‌‌లిఫ్ట్@94.30 లక్షలు

ల్యాండ్ రోవర్ ‘రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‌‌లిఫ్ట్’​ను లాంచ్​ చేసింది. దీని ధర రూ. 94.30 లక్షలు (ఎక్స్-షోరూమ్).  డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్  296 బీహెచ్​పీని,  365 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది. డీజిల్ ఇంజన్ 201 బీహెచ్​పీని,  420 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేస్తుంది.

ఎనిమిది గేర్లు ఉంటాయి. పెట్రోల్‌‌తో నడిచే వెలార్ 7.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. డీజిల్ బండి 8.3 సెకన్లు తీసుకుంటుంది.  11.4 అంగుళాల  టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, నాయిస్ క్యాన్సిలేషన్,  వైర్‌‌లెస్ ఛార్జర్ వంటి ప్రత్యేకతలు వీటి సొంతం.