యానిమల్ వైల్డ్ ట్రైలర్.. నరాలు తెగిపోయే విధ్వంసం.. వేరే లెవల్ అంతే!

యానిమల్ వైల్డ్ ట్రైలర్.. నరాలు తెగిపోయే విధ్వంసం.. వేరే లెవల్ అంతే!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ కంటెంట్ తో అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ వంటి స్టార్ కీ రోల్స్ లో కనిపిస్తున్నారు. 

పోస్టర్ అండ్ టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 3 నిమిషాల లెన్త్ తో వచ్చిన ఈ వైల్డ్ ట్రైలర్ ఆడియన్స్ మతులు పోగొడుతోంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్ తో మొదలైన ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవల్ సీన్స్ అండ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఒక్కో షాట్, ఒక్కో విజువల్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు యానిమల్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది ఈ ట్రైలర్. ఇక ఈ ట్రైలర్ చూశాక బాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.   

సందీప్ రెడ్డి ముందుగా చెప్పినట్టుగానే.. తనదైన యాక్షన్ సీన్స్ తో రెచ్చిపోయాడు. వైలెన్స్ అనే పదానికి సరైన డెఫినేషన్ ఇవ్వబోతున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి లాంటి రా అండ్ ఎమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ సినిమాతో మరో సంచలనానికి తెరతీసేలా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.