
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాను ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తపై నటుడు రావు రమేష్ స్పందించారు. ఆ ట్వీట్ తాను చేయలేదని చెప్పారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలుపుతూ… `నాకు సోషల్‌మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. వేటిల్లోనూ నాకు అకౌంట్ లేదు. ఈ రోజు నా పేరు మీద ఎవరో ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నాన`ని తెలిపారు.