ఆనంద్ కోసం రష్మిక.. ఇదంతా విజయ్ ట్రైనింగేనా?

ఆనంద్ కోసం రష్మిక.. ఇదంతా విజయ్ ట్రైనింగేనా?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ. ఈ సినిమాతో యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రేమిస్తున్నా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ హాజరైన రష్మిక, ఆనంద్ దేవరకొండకు సపోర్ట్ గా నిలిచింది. అయితే.. ఈ వేడుకకు రష్మిక గెస్ట్ గా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇదంతా విజయ్ దేవరకొండ ట్రైనింగ్ అని, విజయ్ కోసమే ఆనంద్ దేవరకొండకు రష్మిక సపోర్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై ఇటు విజయ్ గానీ, అటు రష్మికా గానీ ఎలా స్పందింస్తారో చూడాలి.

ఇక బేబీ సినిమాకు విజయ్ బిల్గానిన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీని ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.