Rashmika Mandanna: మందన్నా.. మజాకా! 40 మిలియన్ల పాలోవర్లు

Rashmika Mandanna: మందన్నా.. మజాకా! 40 మిలియన్ల పాలోవర్లు

బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో తన అసాధారణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ రష్మిక మందన్న. రణబీర్ కపూర్‌తో కలిసి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు దాటి దూసుకుపోతూ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. 

లేటెస్ట్ గా ఈ అమ్మడు ఇన్ స్టాలో 40 మిలియన్ల ఫాలోవర్ల మైలు రాయిని దాటేసింది. . సౌత్ హీరోయిన్స్‌లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి. ఈ సందర్బంగా రష్మిక కొన్నిచిత్రాలను షేర్ చేసింది. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సొగసైన చోకర్, చిక్ పోనీటైల్ మరియు పింక్ లిప్‌స్టిక్‌తో ఆకర్షణీయమైన క్రీమ్-రంగు చీరలో క్యూట్ గా కనిపిస్తోందీ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నేషనల్ క్రష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే. అందాల రాక్షసి, చిలసౌ వంటి మూవీస్ తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్​ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తోంది. ఇది రష్మికకు 24వ చిత్రం కాగా..గీతా ఆర్ట్స్51వ చిత్రంగా తెరకెక్కనుంది. అలాగే రెయిన్‌బో, ధనుష్ D51, ఛావా, అల్లు అర్జున్ పుష్ప: ది రూల్, రవితేజతో ఓ మూవీ చేయనుంది.