రష్మిక వింత సెంటిమెంట్.. యానిమల్కు కూడానా?

రష్మిక వింత సెంటిమెంట్.. యానిమల్కు కూడానా?

బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్న రష్మికా మందన్న(Rashmika mandanna) వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ నటిస్తున్న యానిమల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు డిసెంబర్​ నెల అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. యానిమల్(Animal)​ రిలీజ్​ కూడా ఇదే నెలలో రావడం తనకు కలిసొస్తుందని వివరించింది. 

నా మొదటి సినిమా ‘కిరిక్​ పార్టీ(Kirik party)’ డిసెంబర్లో విడుదలై పెద్ద సక్సెస్​ సాధించింది. ఆ తర్వాత నేను చేసిన నాలుగు సినిమాలూ ఇదే నెలలో వచ్చి బ్లాక్​బస్టర్స్​ అందుకున్నాయి. అందులో పుష్ప(Pushpa) మూవీ నాకు ఇంటర్నేషనల్​ లెవెల్​లో గుర్తింపును తీసుకువచ్చింది. ఇప్పుడు యానిమల్ కూడా డిసెంబర్​ 1న విడుదలవుతోంది. దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్​ చేసుకుంటారోనని ఆసక్తిగా చూస్తున్నా. నా కెరీర్​లోనే ఈ రోల్​ భిన్నంగా ఉంటుంది’ అని రష్మిక తెలిపింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్​లో రణ్​బీర్​ కపూర్(Ranbir kapoor)​తో ఈ బ్యూటి జోడీ కట్టింది.