
గతేడాది డిసెంబర్ లో రిలీజైన పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, స్టెప్పులు వీపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని రా రా సామి పాటకు ఓ స్కూల్ చిన్నారి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్న ఆ చిన్నారి... మిగతా పిల్లలతో కూడా ఆ సాంగ్ కి డాన్స్ చేయించింది. దీనికి సంబంధించిన వీడియోను దర్శకుడు ఎస్ జే సూర్య తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ అల్లు అర్జున్, రష్మికలకు ట్యాగ్ చేశాడు. ఆ చిన్నారి డ్యాన్స్ కు పిధా అయిన హీరోయిన్ రష్మిక... 'మేడ్ మై డే... ఈ క్యూట్ బేబీని కలవాలి. ఎలాగో కొంచెం చెప్తారా?' అంటూ కామెంట్ పెట్టింది. సుకుమార్ డైరెక్ష్లన్ లో తెరకెక్కిన పుష్ప మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. పార్ట్ 2 ను భారీ బడ్జెట్ తో రూపోందిస్తున్నారు.
Love u baby ????????? cute cute @alluarjun sirrrr @iamRashmika ?????? https://t.co/qC7t7O01mJ
— S J Suryah (@iam_SJSuryah) September 14, 2022