ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmik Mandanna) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అందులో విజయ్ హీరోగా వచ్చిన వారిసు, ఇటీవల వచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 కూడా ఉంది. 

ఇక ఇటీవలే మరో క్రేజీ ప్రాజెక్టు కు కూడా ఒకే చెప్పేసింది ఈ బ్యూటీ. సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా కీ రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే.. సౌత్, నార్త్ లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రశ్మిక ధనుష్ తో మాత్రం ఇప్పటివరకు నటించలేదు. దాంతో ఈ సినిమా షూటింగ్ టైం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుందట రష్మిక.

ఇటీవల ధనుష్ సినిమా గురించి మాట్లాడిన రష్మిక.. ధనుష్‌ గారితో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆయన మంచి పర్ఫార్మర్‌, ఆయనతో నటించడం వల్ల చాలా విషయాలను నేర్చుకోవచ్చు. ఆయనతో నటించడానికి ఇది కూడా ఒక కారణం. వచ్చే నెల నుండి నేను ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాను, ధనుష్ గారితో నటించే ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చాడు రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.