Rashmika Mandanna: ప్లాప్ అయినా ఆ సినిమానే ఇష్టం.. విజయ్ మూవీపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rashmika Mandanna: ప్లాప్ అయినా ఆ సినిమానే ఇష్టం.. విజయ్ మూవీపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకుంది. ఆ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన రష్మిక.. యానిమల్ సినిమాతో ఆ స్టేటస్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. 

ప్రెజెంట్ కూడా ఈ బ్యూటీ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప 2 ఒకటి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుండి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. పుష్ప సినిమాలో తన పాత్ర గురించి, ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో బెస్ట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పుష్ప 2  సినిమాలో తన పాత్ర గురించి అడగగా.. పుష్ప 2లో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, ఈ సినిమాలో శ్రీవల్లి 2.Oని చూస్తారు అని చెప్పుకొచ్చింది. అలాగే.. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటని అడగగా.. విజయ్ తో చేసిన డియర్ కామ్రేడ్ నా మనసుకి నచ్చిన సినిమా. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు కానీ, ఇందులోని నా పాత్రకు, నా నటనకు ప్రశంసలు దక్కాయి. అందుకే డియర్ కామ్రేడ్ సినిమా నా హృదయానికి దగ్గరైంది.. అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.