ఐశ్వర్య వ్యాఖ్యలపై స్పందించిన రష్మిక

ఐశ్వర్య వ్యాఖ్యలపై స్పందించిన రష్మిక

పుష్ప సినిమాలో శ్రీవల్లి రోల్​ పై ఐశ్వర్య రాజేష్​ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రష్మిక స్పందించింది. ‘హాయ్​ లవ్​.. నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. మనకు మనం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ విషయంలో నేను ఎంత ప్రేమ, గౌరవంతో ఉంటానో నీక తెలుసు అంటూ రష్మిక పోస్ట్ ​చేసింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ శ్రీవల్లి లాంటి పాత్రలు తనకు బాగా నప్పుతాయనడం కాంట్రవర్సీగా మారింది. దీంతో ఆమె క్లారిటీ ఇస్తూ తానలా అనలేదని.. తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం  చేసింది. రష్మిక కన్నా నేను గొప్పగా చేస్తానని అనలేదని.. అలాంటి పాత్రలను ఇష్టపడతానని తెలిపినట్టుగా వివరణ ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో రష్మిక దీనిపై స్పందించి ఈ వివాదానికి పుల్​స్టాప్​ పెట్టే ప్రయత్నం చేసింది.