Rashmika Mandanna: బోల్డ్ ఫ్యాషన్ లుక్‌లో రచ్చరేపుతున్న రష్మిక.. సోషల్ మీడియా షేక్ అంతే..

Rashmika Mandanna: బోల్డ్ ఫ్యాషన్ లుక్‌లో రచ్చరేపుతున్న రష్మిక..  సోషల్ మీడియా షేక్ అంతే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతోనే కాదు.. క్రేజీ ఫోటోషూట్స్తో దుమ్మురేపుతోంది. లేటెస్ట్గా రష్మిక బోల్డ్ హై-ఫ్యాషన్ లుక్‌తో మతిపోగెట్టేస్తుంది. అసలు ఆ ఫోటోచూస్తే.. రష్మిక అంటే ఎవ్వరూ కూడా నమ్మరనే చెప్పొచ్చు. మరి ఆ ఫోటో వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

‘డర్టీకట్ 2025’అనే స్పెషల్ మ్యాగజైన్ కోసం రష్మిక కొత్త లుక్లో దర్శనమిచ్చింది. కర్లీ హెయిర్, డార్క్ మేకప్, ఎడ్జీ స్టైలింగ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎడిటోరియల్ షూట్‌లో బయటపడ్డ రష్మిక కొత్త అవతారం ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది తమ ఫ్యాన్స్కు మాత్రమే కాదు.. నెటిజన్లు సైతం దాదాపుగా గుర్తించలేని విధంగా చేసింది.

ఈ క్రమంలో నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ‘కనిపించేది నిజంగా రష్మికేనా.. డౌట్గా ఉందని అంటుండగా, ‘మల్లన్న సినిమాలో శ్రియ లుక్‌లా ఉందంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. రష్మిక ఫ్యాన్స్ మాత్రం ‘లుక్ అద్భుతంగా ఉంది.. రష్మిక ప్రయోగానికి హ్యాట్సాఫ్’అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DIRTY (@thedirtymagazine)

తన అద్భుత మేకోవర్కి కారణమైన బృందానికి రష్మిక థ్యాంక్స్ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేస్తూ.. టెక్నీకల్ టీంకి పూర్తి క్రెడిట్ ఇచ్చింది. వారిలో ఎడిటర్-ఇన్-చీఫ్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ క్షితిజ్ కంకారియా మరియు అద్భుతమైన విజువల్స్‌ను చూపించిన ఫోటోగ్రాఫర్ రాచెల్ పచువా ఉన్నారు. స్టైలింగ్ రుహాని సింగ్ చేయగా, రిషా శెట్టి సెట్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. మేకప్‌ను తన్వి చెంబుర్కర్ నిర్వహించారు.  హెయిర్ ఆర్టిస్ట్‌గా సౌరవ్ రాయ్ తన మ్యాజిక్‌ను చూపించారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది. 

►ALSO READ | నయనతార బయోపిక్‌కి కాపీరైట్ కష్టాలు.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Nod (@thenodmag)

రష్మిక మందన్న గత నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాలతో మంచి సక్సెస్ జోష్లో ఉంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్కు సాధ్యం కాని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్‌బో' మరియు 'పుష్ప 3', మైసా మూవీస్ తో పాటుగా మరిన్ని లైన్లో ఉన్నాయి.