'రాష్ట్రపతి భవన్ ఉద్యానోత్సవ్'ను ఆవిష్కరించనున్న ద్రౌపది ముర్ము

'రాష్ట్రపతి భవన్ ఉద్యానోత్సవ్'ను ఆవిష్కరించనున్న ద్రౌపది ముర్ము

రేపు రాష్ట్రపతి భవన్ ఉద్యానోత్సవ్ 2023 ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రపతి భవన్  గార్డెన్  ప్రజానీకానికి అందుబాటులోకి రానుంది. అందులో భాగంగా రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ సహా అన్ని గార్డెన్ల పేర్లను అమృత్ ఉద్యాన్ గా మార్పు చేయనున్నారు. జాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మొఘల్ గార్డెన్ పేరు మార్పు చేయనున్నారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు అమృత్ ఉద్యాన్ సందర్శన అందుబాటులో ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. మార్చి 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల్లోని వారికి అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు. అయితే ప్రతి రోజు 6 స్లాటుల్లో అధికారులు ప్రజలను అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. 

ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఈ సందర్శనకు అవకాశం కల్పిస్తామని, అందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే మొఘల్ గార్డెన్ లో అన్ని మొక్కలకు క్యూ ఆర్ కోడ్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక రంగుల తులిప్ మొక్కలను కూడా అందుబాటులో ఉంచగా.. సందర్శకలకు20 మంది గైడ్స్ ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కొవింద్ హయాంలో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త గార్డెన్స్ లో 40 రకాల సువాసనలు వెదజల్లే గులాబీలు ఉండడం విశేషం. అంతే కాదు నలుపు, ఆకుపచ్చ రంగుల గులాబీలు సహా రకరకాల పూలు ఉండడం చెప్పుకోదగిన విషయం.