యాక్టర్ టూ కామెంటేటర్.. రవితేజకే సాధ్యమైన మాస్ రికార్డు ఇది

యాక్టర్ టూ కామెంటేటర్.. రవితేజకే సాధ్యమైన మాస్ రికార్డు ఇది

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ  కొత్త అవతారం ఎత్తాడు. ఇన్నాళ్లు డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్తో  అభిమానులను అలరించిన రవితేజ..భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లో  సందడి చేశాడు.  భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో రవితేజ ప్రత్యక్షమై ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. 

వ‌న్డే వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా ఫస్ట్స మ్యాచ్ ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో  ఈ మ్యాచ్ జ‌రుగుతోంది. అయితే ఈ మ్యాచ్కు రవితేజ కామెంటేటర్గా అవతారం ఎత్తాడు. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రవితేజ కామెంట్రీ చేశాడు.   ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యాయి.

ర‌వితేజ ప్రస్తుతం  టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించాడు. ఈ మూవీ  అక్టోబర్ 20న విడుదల కానుంది.  ఈ నేప‌థ్యంలో  టైగర్ నాగేశ్వరరావు మూవీ  ప్రమోష‌న్స్‌లో భాగంగా ర‌వితేజ స్టార్ స్పోర్ట్స్  తెలుగు క్రికెట్ లైవ్ కామెంట‌రీలో పాల్గొన్నాడు.  

ALSO READ : Cricket World Cup 2023: ఆసీస్‌ని వణికించారు: వరల్డ్ కప్ తొలి మ్యాచులో అదరగొట్టిన భారత బౌలర్లు

భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కామెంటేటర్ అవతారం ఎత్తిన రవితేజ..అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ మ్యాచుకు కామెంటరీ చేసిన తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు.  గతంలో ఐపీఎల్ సందర్భంగా విజయ్ దేవరకొండ  స్టేడియంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రవితేజ మాత్రం ఏకంగా వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం కామెంటరీ చేశాడు. తెలుగు హీరో వరల్డ్ కప్ ప్ మ్యాచ్‌కి కామెంటరీ చేయడం ఇదే తొలిసారి.