రివ్యూ: ఖిలాడి

రివ్యూ: ఖిలాడి

రివ్యూ: ఖిలాడి
రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు
నటీనటులు: రవితేజ,డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ,మురళి శర్మ, వెన్నెల కిషోర్, ముఖేష్ రుషి, రావు రమేష్, ఉన్ని ముకుందన్, సచిన్ ఖేద్కర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
మాటలు: శ్రీకాంత్ విస్సా
రచన,దర్శకత్వం: 
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11,2022

కథేంటి?
గాంధీ (రవితేజ) ఓ కంపెనీలో సి.ఇ.వో గా పనిచేస్తుంటాడు. తనకు ఎవరూ లేకపోవడంతో చైర్మైన్ రాజశేఖర్ (రావు రమేష్) అన్ని తానై పెంచుతాడు. ఎదురింట్లో ఫ్లాట్ లో ఓ ఫ్యామిలీ దిగుతుంది. వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే రాజశేఖర్ మనీ లాండరింగ్ వివాదంలో చిక్కుకుంటాడు. పదివేల కోట్లు హోమ్ మినిస్టర్ కు అప్పగించాలి. రాజశేఖర్ ను సేవ్ చేసేందుకు గాందీ మధ్యలో ఇరుక్కుంటాడు. దుండగులు తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తారు. గాంధీ అప్పుడేం చేశాడు. పోలీసులు,హోమ్ మినిస్టర్ ,మాఫియా నుండి ఎలా తప్పించుకున్నాడు. అసలు ఆ డబ్బెవరిది అనేది స్టోరి.


నటీనటుల పర్ఫార్మెన్స్:
రవితేజ ఎప్పటిలాగే ఎనర్జీ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అన్ని రకాల ఎమోషన్స్ పండిస్తూ ఎంటర్ టైన్ చేశాడు. సినిమాకు ప్రధాన బలమైయ్యాడు. యాక్షన్ కింగ్ అర్జున్ పోలీసాఫీసర్ పాత్రలో రాణించాడు. ఇక డింపుల్ గ్లామర్ తో ఉర్రూతలూగించింది. పర్ఫార్మెన్స్ తో ఓకే అనిపించినా..డాన్సులు, ఎక్స్ పోజింగ్ లో ఏ మాత్రం వెనకాడలేదు. మీనాక్షి చౌదరి అంతే. నటన పరంగా ఓకే కానీ. ఓ సాంగ్ లో డాన్సులతో అదరగొట్టింది. అనసూయ సర్ ఫ్రైజింగ్ రోల్ చేసింది. రావు రమేష్ , మురళి శర్మ, ముఖేష్ రిషి, సచిన్ కేద్కర్ తదితరులు అలవాటైన పాత్రల్లో రాణించారు.
 

టెక్నికల్ వర్క్:
సుజిత్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. క్వాలీటీ విజువల్స్ తో అదరగొట్టాడు. దేవి అందించిన పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా లేదు.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.ప్రొడక్షన్ వాల్యూయ్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు.శ్రీకాంత్ విస్సా డైలాగులు బాగున్నాయి.
 

విశ్లేషణ:
‘‘ఖిలాడీ’’ కమర్షియల్ ప్యాకేజ్. రెగ్యులర్ కథే కానీ..దానికి కొన్ని ట్విస్టులు యాడ్ చేసి ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ రమేష్ వర్మ. స్టార్టవగానే కొద్దిగా విసుగు అనిపించినా.. తర్వాత మెయిన్ కథలోకి వెళ్లగానే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆ తర్వాత వచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఫస్టాఫ్ లో ఆ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటుందో అని లోపలికి వెళ్ళిన వాళ్లకి మాత్రం నిరాశ మిగుల్తుంది. అలాంటి ట్విస్టులే మళ్లీ మళ్లీ రిపీట్ కావడం వల్ల బోర్ కొడుతుంది. దానికి తోడు అనవసరమైన పాటలు,ఫైట్లు. అసలు ఒక్కోసారి స్క్రీన్ మీద ఏం జరగుతుందో అర్థం కాదు.అంత కంగాళీగా ఉంది స్క్రీన్ ప్లే.డైరెక్టర్ అనుకున్న పాయింట్ టేబుల్ మీద ఎక్జయింటింగ్ అనిపించవచ్చు కానీ తెరమీద కన్ఫ్యూజన్ గా ఉంది. దాని వల్ల మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది. టెక్నాలజీని తమకిష్టం వచ్చినట్టు కన్సీనియంట్ గా తీసుకొని, పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేశారు. అంతేకాదు ఆడియన్స్ ను కూడా చీట్ చేసేలా ఉన్నాయి కొన్ని ట్విస్టులు. చివరికి వచ్చేసరికి ఏది నిజమో ఏది ఫేకో తెలియదు. సినిమాకు సేవింగ్ గ్రేస్ ఏదైనా ఉందంటే అది రవితేజే. రెగ్యులర్ కమర్షియల్ కథలు నచ్చి, రవితేజ అంటే ఇష్టం ఉన్నవాళ్లకు ఓకే అనిపించవచ్చు కానీ మిగతావారు డిజప్పాయింట్ అవుతారు. 

బాటమ్ లైన్:  కిల్ -ఖిలాడీ

 

మరిన్ని వార్తల కోసం:

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతా