Mass Jathara Box Office: రవితేజ ‘మాస్ జాతర’ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Mass Jathara Box Office:  రవితేజ ‘మాస్ జాతర’ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా ‘మాస్ జతర’. శనివారం (2025 నవంబర్1న) థియేటర్లలో రిలీజై మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. లక్ష్మణ్ భేరి అనే పోలీస్ పాత్రలో నటించిన రవితేజ, మరోసారి తన మాస్ యాంగిల్ను పరిచయం చేశాడు. దాంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. వీకెండ్ అవ్వడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్తో పాటుగా సినీ ఆడియన్స్ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ‘మాస్ జతర’ మూవీ ఫస్ట్ డే వసూళ్లు ఎలాంటి అంచనాలు సాధించింది? ముందస్తు అంచనాలకు తగ్గట్టుగా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేసిందా? లేదా అనేది లుక్కేద్దాం. 

ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం.. ‘మాస్ జతర’ మూవీ ఫస్ట్ డే వసూళ్లతో ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ఫస్ట్ డే (శనివారం) ఇండియాలో రూ.3.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రవితేజ లాస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ రూ.3.5 కోట్ల నెట్ వసూళ్లతో పోలిస్తే, మాస్ జతర కొంచెం బెటర్ కలెక్షన్స్ సాధించింది. కానీ, ఈగల్ ( రూ.6.2 కోట్ల నెట్) కంటే తక్కవ వసూళ్లను రాబట్టింది.

ఇక ఇండియాలో ‘మాస్ జతర’ ప్రీమియర్ కలెక్షన్స్ శుక్రవారం (అక్టోబర్ 31న).. రూ.2.9 కోట్ల నెట్, వరల్డ్ వైడ్గా రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో‘మాస్ జతర’ మూవీ ఇండియా వైడ్గా తొలి రోజు రూ.6.65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్గా రూ.13 నుంచి రూ.15 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

ఇవాళ ఆదివారం (నవంబర్ 2న) వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతనేది మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే, ‘మాస్ జతర’ మూవీ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 27.71% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది.

మాస్ జాతర కథేంటంటే:

లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక పవర్‌ఫుల్ రైల్వే పోలీసు అధికారి. తన పరిధి కాకపోయినా అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం అతనిది. ఈ క్రమంలోనే వరంగల్‌లో ఓ కేసులో మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అక్కడి నుంచి అల్లూరి జిల్లాలోని అడవివరం అనే మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు.

అయితే ఆ ప్రాంతం మొత్తం శివుడు (నవీన్ చంద్ర) అనే గంజాయి స్మగ్లర్ కంట్రోల్‌లో ఉంటుంది. జిల్లా ఎస్పీ నుంచి రాజకీయనాయకుల అండదండలు శివుడికి ఉంటాయి. మరి ఆ శివుడు సామ్రాజ్యాన్ని, కేవలం రైల్వే ఎస్సై అయిన లక్ష్మణ్ భేరి ఎలా అడ్డుకున్నాడు? తులసి (శ్రీలీల) పాత్ర ఈ కథలో ఎలా కీలకంగా మారింది? అన్నదే అసలు కథ.