
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం (జూలై 27) ముగిసిన నాలుగో టెస్ట్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐదో రోజు ఆటలో భాగంగా ఇరు జట్ల మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదో రోజు ఆట మరో 15 ఓవర్లు ఉండగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా చేసుకోవాలని జడేజా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూశాడు. అయితే అప్పటికే సుందర్, జడేజా ఇద్దరూ కూడా సెంచరీలకు దగ్గరలో ఉండడంతో మన జట్టు డ్రా కు అంగీకరించలేదు. దీంతో కాసేపు గ్రౌండ్ లో హై డ్రామా చోటు చేసుకుంది.
ఈ సమయంలో స్టోక్స్ మ్యాచ్ డ్రా కోసం షేక్ హ్యాండ్ కోరుతూ జడేజా దగ్గరుకు వెళ్ళాడు. అయితే జడేజా అప్పుడు 89 పరుగులు వద్ద ఉంటే.. సుందర్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా సెంచరీలు దగ్గరలో ఉండడంతో జడేజా, సుందర్ స్టోక్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. క్రీడా స్ఫూర్తి మరచి భారత ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడినందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ సంఘటనపై తాజాగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంగ్లాండ్ జట్టుపై కౌంటర్ విసిరి తనదైన శైలిలో సెటైర్ వేశాడు.
►ALSO READ | IND vs ENG 2025: టీమిండియాతో ఐదో టెస్టు.. స్క్వాడ్ ప్రకటించిన ఇంగ్లాండ్
తన యూట్యూబ్ ఛానల్ లోని ఒక వీడియోలో అశ్విన్ కోపంగా మాట్లాడుతూ.." రూల్ ప్రకారం మ్యాచ్ లో ఫలితం రాదని ఇద్దరు కెప్టెన్లు భావిస్తే వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మ్యాచ్ ను డ్రాగా ప్రకటించవచ్చు. ఇక్కడ స్టోక్స్‌కు రెండు కారణాలు ఉన్నాయి. అతను తన బౌలర్లను అలసిపోవాలని కోరుకోలేదు. దానితో పాటు వికెట్లు పడలేదనే నిరాశలో ఉన్నాడు. దీంతో ప్రత్యర్థి జట్టు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోలేదు. నేను భారత కెప్టెన్‌ను అయితే, మిగిలిన 15 ఓవర్లు ఆడమని చెప్పేవాడిని. ఇంగ్లాండ్‌కు నా ప్రశ్న ఏమిటంటే, మీరు క్రికెట్ స్ఫూర్తికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, హ్యారీ బ్రూక్‌ను 15 ఓవర్ల బౌలింగ్ ఇచ్చి ఉండాల్సింది". అని అశ్విన్ అన్నాడు.