పవన్ మూవీలో వెటరన్ బ్యూటీ రవీనా

పవన్ మూవీలో వెటరన్ బ్యూటీ రవీనా

హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో రవీనా టండన్ నటించబోతున్నట్టు సమాచారం. రవీనా టండన్... బాలీవుడ్ లో ఓ ఊపు ఊపింది. తెలుగులో ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, రథ సారధి సినిమాల్లో నటించింది. ఈ సీనియర్ అందగత్తె.. రీసెంట్ గా వచ్చిన కెజియఫ్ 2 మూవీలో.. ప్రధాన మంత్రి పాత్రలో సత్తా చూపించింది. ప్రధాన మంత్రి రిమికా సేన్ గా పవర్ఫుల్ గా కనిపించింది. ఈ సారి పవర్ స్టార్ సినిమాలో కూడా.. మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట. ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’లో పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో వస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం ఫ్యాన్స్ ఎదురుచేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ కు కొత్త కమిటీలు

"ప్రజా సంగ్రామ యాత్ర" వాయిదా వార్తల్లో నిజం లేదు