రూ.2 వేల నోట్ల మార్పిడికి అంతా రెడీ.. ట్యాక్స్ కట్టని వారిపై ఈడీ నిఘా

రూ.2 వేల నోట్ల మార్పిడికి అంతా రెడీ.. ట్యాక్స్ కట్టని వారిపై ఈడీ నిఘా

ఢిల్లీ : దేశంలోని అన్ని బ్యాంకుల వద్ద షామియానాలు వేయడంతోపాటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస కోరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి అన్ని బ్యాంకుల వద్ద రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో వ్యక్తి 20 వేల రూపాయలు(10 పీసెస్) మార్చుకొనే వీలుందన్నారు. రూ. 2 వేల నోట్ల ముద్రణ ఆపేసీ చాలా కాలమైందని చెప్పారు. ఆ నోట్ల సర్క్యేలేషన్ కూడా బాగా తగ్గిందని చెప్పారు. రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిన లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నారు. పన్నులు చెల్లించని వారిపై ఈడీ, సీబీఐ నిఘా ఉంటుందని, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటుందని చెప్పారు. 

వసూలవుతున్న పన్నులు

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాకు చెందిన ఓ బస్సు యజమాని ఏకంగా తన వాహనంపై ఉన్న రూ.6 లక్షల పన్నులో రూ.4 లక్షలను రూ.2వేల నోట్లతో కట్టారు. రాజ్‌కోట్‌కు చెందిన బస్సుపై ఒక ఏడాదికి సంబంధించిన పన్ను బకాయి ఉందని గుర్తించిన అధికారులు కొద్ది రోజుల క్రితం సీజ్ చేసి ఆర్‌టీఏ కార్యాలయానికి తరలించి షెడ్‌లో ఉంచారు. మొత్తం పన్ను కట్టిన తర్వాతే బస్సును తిరిగి తీసుకెళ్లాలని సూచించారు. దీనిని యజమాని పెద్దగా పట్టించుకోలేదు. రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం జరిగిన మరు సటి రోజే అతడు రూ. 4 లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లతో పన్ను చెల్లించారు. మిగతా రెండు లక్షలను రూ.100, రూ.500 నోట్లను పే చేశాడు.