డబ్బుల విషయంలో సామాన్య జనానికి ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

డబ్బుల విషయంలో సామాన్య జనానికి ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించి ఇవాళ కీలక సమావేశం జరిగింది. జూన్ 6న మొదలైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఆర్బీఐ తీసుకునే ప్రతీ నిర్ణయం ప్రభావం దేశంలో ఉండే సామాన్య జనంపై ఎంతోకొంత ఉండకుండా పోదు. అసలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలేంటి..? ఆ నిర్ణయాల ప్రభావం కామన్ మ్యాన్పై ఎంతవరకూ ఉంది..? సింపుల్గా ఐదు పాయింట్లలో తెలుసుకుందాం..

యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు: యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఈ పెంపు అందరికీ వర్తించదు. ట్యాక్స్ పేమెంట్స్ చేసేవారికి మాత్రమే యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు వర్తిస్తుంది. ట్యాక్స్ పేయర్లకు లక్ష నుంచి ఐదు లక్షలకు యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పరిమితిని పెంచడం వల్ల పెద్ద ఎత్తున, లక్షల్లో ట్యాక్స్ బకాయిలు ఉన్న వారికి త్వరగా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో.. దిగువ మధ్య తరగతి ప్రజలపై ఈ నిర్ణయం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.

* గంటల్లోనే చెక్ క్లియరెన్స్: చెక్ క్లియరెన్స్కు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై చెక్ ఇష్యూ అయిన తర్వాత క్లియరెన్స్ కోసం రోజులకు రోజులు వేచి ఉండాల్సిన పనిలేదని చెప్పింది. చెక్ తీసుకున్న కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చెక్ క్లియరెన్స్ కోసం బ్యాంకులు సీటీఎస్ (Cheque Truncation System) విధానాన్ని అనుసరిస్తున్నాయి. చెక్ క్లియరెన్స్ కోసం బ్యాచ్ ప్రాసెసింగ్ మోడ్లో బ్యాంకులు పనిచేస్తుండటం వల్ల చెక్ క్లియరెన్స్కు ప్రస్తుతం రెండ్రోజులు పడుతోంది. ఆర్బీఐ ఇకపై చెక్ క్లియరెన్స్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం ‘ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్’ విధానాన్ని తీసుకురానుంది. ఈ విధానంలో కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ పూర్తవుతుంది. ఈ నిర్ణయం చాలా మందికి చెక్ క్లియరెన్స్ తిప్పలు తప్పించనుంది.

* దేశంలో పప్పులు, ఉప్పులు, బియ్యం.. ఇలా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆయన సానుభూతి మాత్రమే తప్ప సామాన్య ప్రజలకు ఈ ధరల భారం మోయక తప్పేలా లేదు.

* రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పులుచేర్పులు చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న కస్టమర్లకు వడ్డీ రేట్ల నుంచి ఎలాంటి ఊరట లేనట్టే. ఈఎంఐలపై ప్రస్తుతం కడుతున్న వడ్డీ రేట్లు చెల్లించాల్సిందే. రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఆర్బీఐకి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు కొంత భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీద మోపుతాయి. రెపో రేటు తగ్గితే తక్కువ వడ్డీకే బ్యాంకులు కస్టమర్లకు లోన్లు ఇస్తాయి. ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఎలాంటి ఊరట లభించలేదు.

* రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 శాతం నుంచి 4 శాతంలోపు ఉండేలా చూసుకోవాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ 4.5 శాతంగా,  మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.9 శాతంగా, రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.8 శాతంగా, మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.6 శాతంగా, నాల్గో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.5 శాతంగా రికార్డవుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అంచనా వేస్తోంది. రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌ తగ్గించడంపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.