నిబంధనలు పాటించలేదు.. అందుకే Paytmపై చర్యలు: ఆర్బీఐ

నిబంధనలు పాటించలేదు.. అందుకే Paytmపై చర్యలు: ఆర్బీఐ

ఆర్బీఐ నియమనిబంధనలు పాటించకపోవడం వల్లే  Paytmపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. పేటీఎంపై చర్యలు దారి తీసిన నిర్ధిష్టమైన లోపాలను వెల్లడించలేదు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ఒక బాధ్యతాయుతమైన సంస్థ. నియంత్ర సంస్థ ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉంటే పేటీఎం పై ఎందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు శక్తికాంత్ దాస్. 

ఆర్బీఐ ద్వైపాక్షిక ప్రాతిపదికన ఎంటీటీలతో పనిచేస్తుంది.. తగిన సమయం ఇవ్వడం ద్వారా వాటిని నియమ నిబంధనలు పాటించేలా చేస్తుంది. ఎంటీటీ అవసరమైన చర్యలు తీసుకోనప్పుడు మాతరమే వ్యాపార పరిమితులు లేదా పర్యవేక్షక చర్యలను సెంట్రల్ బ్యాంక్ విధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.

ఈ చర్యలు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకుంటామని తెలిపారు. ఆర్థిక రంగంలో ఆవిష్కర్ణలకు మద్దతు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిబద్ధత ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండకూడదని శక్తికాంత్ దాస్ అన్నారు.