HBD Ram Charan: RC16 టీమ్ స‌వాల్ విసిరిందా? బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తామ‌ని హామీ ఇస్తుందా!

HBD Ram Charan: RC16 టీమ్ స‌వాల్ విసిరిందా? బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తామ‌ని హామీ ఇస్తుందా!

గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌తోన్న కొత్త సినిమా (RC16) ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్ గా షురూ అయింది. స్పోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రిస్ఠిక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు సమాచారం.

RC16 లేటెస్ట్ పోస్ట్తో హైప్ ఇచ్చేసింది. అదేంటంటే..ఇవాళ (మార్చి 27న) చరణ్ బర్త్ డే సందర్బంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేశారు. 'మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు..అభిమానులను గర్వపడేలా RC16 ఉంటుందని' పోస్ట్ చేశారు. 

ఆస‌క్తిక‌రంగా విషయం ఏంటంటే..చరణ్ బర్త్ డే కోసం డిజైన్  చేసిన పోస్టర్ ఇక్కడ హైలెట్ అయింది.ఈ పోస్ట‌ర్లో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్ లుక్ ని ఎలివేట్ చేస్తూనే..అతను నటించిన సినిమాల పోస్టర్ లను చూపించింది. చరణ్ బాబు చిరుత నుండి RRR, గేమ్ ఛేంజర్ వరకు ఉన్న ల్యాండ్ మార్క్ సినిమాల పోస్ట‌ర్ల‌ను పంచుకుంది. 

కానీ ఆ పోస్టర్లను చూస్తుంటే..RC16 కూడా ఈ సినిమాలను మించి ఉండేలా ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్లు ఉంది.అలాగే చరణ్ ల్యాండ్ మార్క్ సినిమాలిచ్చే స‌వాల్ ని కూడా స్వీక‌రిస్తున్నట్లుగా ఉంది.ఏదేమైనా RC16 కోసం బుచ్చిబాబు ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం అందుకు తగ్గట్టుగానే మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ ను ఎంచుకున్నారట.

ఇప్పటికే ఈ మూవీలో కన్నడ శివన్న,కోలీవుడ్ విజయ్ సేతుపతి, మలయాళ యాక్టర్ ఆర్‌డీఎక్స్ ఫేమ్ ఆంటోనీ వ‌ర్గీస్ నటుస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే..బుచ్చిబాబు తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ,హిందీ, భాష‌ల‌కు చెందిన స్టార్స్ తో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిని మించిలా..బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్ లో గుసగుసలు మొదలయ్యాయి.