Ram Charan RC16: RC16 ఓపెనింగ్ వీడియో వచ్చేసింది.. రహమాన్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవలబ్బా!

Ram Charan RC16: RC16 ఓపెనింగ్ వీడియో వచ్చేసింది.. రహమాన్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవలబ్బా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi babu sana) దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 20 లాంఛనంగా పూజ కార్యక్రమాలతో మొదలయింది.

ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇంకా ఈ వేడుకలో RC16 చిత్ర యూనిట్ తో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, తదితరులు పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకకు సంబందించిన వీడియో విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ వీడియోకి ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా కొత్తగా రహమాన్ రేంజ్ లో ఉన్న ఈ ఆడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేవలం ఆ మ్యూజిక్ కోసమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. RC16 మూవీ భారీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఆ విషయాన్ని ఈ ఒక్క వీడియోలో చూపించారు.. రహమానా మాజాకా అనుకుంటున్నారు. మరికొందరేమో.. కేవలం ఓపెనింగ్ వీడియోకే ఈ రేంజ్ బీజీఎమ్ అందించారంటే.. ఇంకా సినిమా ఏ లెవల్లో ఉండబోతోందో క్లియర్ గా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.