
వన్డే కెరీర్లో తొలి సెంచరీ రాబట్టిన గిల్ ఇండియా ఇన్నింగ్స్‌లో హీరోగా నిలిచాడు. టాస్ నెగ్గి ధవన్‌తో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ లోకేశ్‌తొలి వికెట్‌కు 63 రన్స్ జోడించి ఎవాన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే ధవన్ కూడా ఎవాన్స్‌కే వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో యంగ్‌స్టర్స్ గిల్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. గిల్ తన ఫామ్‌ను కొనసాగించగా.. గత ఇన్నింగ్స్‌లో ఫెయిలైన కిషన్ జాగ్రత్తగా ఆడుతూ గిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు.శుభ్‌మన్ స్వేచ్ఛగా ఆడుతూ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టాడు. అతని స్ట్రెయిట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్ అలరించాయి.
కిషన్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. 90ల్లోకి వచ్చిన తర్వాత గిల్ కాస్త కంగారు పడ్డాడు. 43వ ఓవర్లో అతని ఎల్బీ కోసం ఎవాన్స్ అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించాడు. కానీ, ఇదే బాల్‌కు ఇషాన్ రనౌటయ్యాడు. ఆఖరి బాల్‌కు హుడా (1)ను కూడా ఎవాన్స్ వెనక్కుపంపగా.. తర్వాతి ఓవర్లో సింగిల్‌తో గిల్ (82 బాల్స్‌లో) సెంచరీ మార్కు దాటాడు. తర్వాత అతను మరింత జోరు పెంచాడు. జాంగ్వే బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన శాంసన్ (15) మరో షాట్‌కు ట్రై చేసి ఔటయ్యాడు. అక్షర్ (1) కూడా ఫెయిలవగా.. చివర్లో గిల్ వరుస బౌండ్రీలతో జట్టుకు మంచి స్కోరు అందించాడు.