
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో దారుణం జరిగింది. చీర్లవంచ పరిధిలో సిరిసిల్లకి చెందిన రియలిస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ (48) ను కారులోనే గొంతు కోసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
గ్రామ శివారు ప్రాంతంలో కారులోనే చంపేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాల తోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూ తగాదాల విషయంలో పలుమార్లు జైలుకి వెళ్లి వచ్చారు రమేష్. ఈ క్రమంలో పాతకక్షతోనే రమేశ్ ను చంపారా లేక ఇతర వేరే కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వారం రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కాప్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఇలాంటి ఈ ఘటనలు ఈ మద్యన రోజురజుకు ఎక్కువువుతున్నారు.