చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ రియల్‌మీ ‘సీ15’, ‘సీ12’ అనే రెండు మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్లను ఇండియా మార్కెట్లో మంగళవారం లాంఛ్ చేసింది. సీ15లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ క్వాడ్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.5 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ జీ35 ప్రాసెసర్ ఉంటాయి. 3జీబీ + 32జీబీ రేటు రూ. 9999 కాగా, 4జీబీ + 64జీబీ వెర్షన్‌కు రూ.10999లు చెల్లించాలి. రియల్‌మీ ‘సీ12’ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.5 ఇంచుల డిస్ ప్లే, మీడియాటెక్ జీ35 ప్రాసెసర్ ఉంటాయి. ఇది- 3జీబీ + 32జీబీ వేరియంట్‌లో మాత్రమే దొరుకుతుంది. ధర రూ. 8999.

