
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్రియల్మీ హైదరాబాద్‌లో బుధవారం తన లేటెస్ట్ బడ్జెట్ఫోన్సీ55ని లాంచ్ చేసింది. 64ఎంపీ కెమెరా, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 64 ఎంపీ కెమెరా, మినీ క్యాప్సూల్ వంటివి ఇందులోని ప్రత్యేకతలు. 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ.10,999 కాగా, 6జీబీ+64జీబీకి రూ.11,999, 8జీబీ+128జీబీకి రూ.13,999 చెల్లించాలి. realme.com, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి ఈ ఫోన్‌ను కొనుకోవచ్చు. ఈ సందర్భంగా కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ‘‘ దేశంలో మాకు 30 వేల స్టోర్స్ ఉన్నాయి. 2023 చివరి నాటికి వీటి సంఖ్యను 50 వేలకు పెంచుతాం. హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి మెయిన్ లైన్ స్టోర్స్ ను నిర్వహిస్తున్నాం. 2023 చివరి నాటికి ఈ ప్రాంతంలోని తమ మెయిన్ లైన్ స్టోర్స్ సంఖ్యను 25–-30 శాతం పెంచుతాం. తెలంగాణలో రియల్మీ మెయిన్ లైన్ మార్కెట్ షేర్ 12.50 శాతం వరకు ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 15 సర్వీస్ సెంటర్స్ ఉండగా, 2023 చివరి నాటికి మరో 12 సర్వీస్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తాం. మా ఆదాయంలో 60 శాతం ఆన్లైన్ నుంచి, మిగతాది ఆఫ్‌లైన్ నుంచి వస్తోంది. ప్రస్తుతం మేం 27 రకాల 5జీ ఫోన్లను అమ్ముతున్నాం. ధరలు రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఉన్నాయి”అని వివరించారు.