
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ Realme నుంచి GT7 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Realme GT 7, Realme GT 7T ,Realme GT 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం(మే27) భారత్ తోపాటు ప్రపంచ మార్కెట్లలో లాంచ్ చేశారు.
ఈ కొత్త GT సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity చిప్‌సెట్‌లతో పనిచేస్తాయి. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో అద్భుతమైన ఛార్జింగ్ అందిస్తాయి. Realme GT 7 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఆకట్టుకుంటోంది. Realme GT 7T డ్యూయల్ రియర్ కెమెరా అద్భుతంగా ఉంది. ఇక Realme GT 7 డ్రీమ్ ఎడిషన్ అనేది ఆస్టన్ మార్టిన్ F1 టీమ్‌తో కలిసి ప్రారంభించబడిన స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్.
Realme GT 7 ధర
రియల్‌మే GT 7 ధర 8GB RAM+ 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 39,999.
12 GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999.
12 జిబి ర్యామ్ + 512 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 46,999.
ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్లలో లభిస్తుంది. ఐస్సెన్స్ బ్లాక్ ,ఐస్సెన్స్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.
Realme GT 7T ధర
Realme GT 7T 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 34,999.
12GB+256GB ,స్టోరేజ్ మోడల్ ధర వరుసగా రూ. 37,999
12GB+512GB RAM ,స్టోరేజ్ మోడల్ ధర వరుసగా రూ. 41,999.
ఈ స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తోంది. IceSense Black, IceSense Blue, Racing Yellow రంగులలో కొనుగోలు చేయొచ్చు.
బ్యాంక్ ఆఫర్లద్వారా కస్టమర్లు Realme GT 7 , Realme GT 7T లను వరుసగా రూ. 34,999 ,రూ. 28,999 ప్రారంభ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ లైనప్ కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్లు మే 30, మధ్యాహ్నం 12 గంటల (మధ్యాహ్నం) నుంచి Amazon ,Realme ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లభిస్తాయి.
►ALSO READ | IPO News: మెయిన్‌బోర్డ్ ఐపీవో కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. గ్రేమార్కెట్లో దూకుడు..
రియల్‌మే GT 7 డ్రీమ్ ఎడిషన్ 16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లో రూ. 49,999 ధరతో వస్తుంది. ఇది ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ షేడ్‌లో లభిస్తుంది. ఈ మోడల్ అమ్మకం జూన్ 13 నుండి ప్రారంభమవుతుంది.
Realme GT 7 స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో+eSIM) Realme GT 7 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0 పై పనిచేస్తుంది. 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ , 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. ఫోన్ ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌పై 12GB వరకు RAM ,గరిష్టంగా 512GB స్టోరేజ్ తో మంచి అనుభూతిని కలిగిస్తుంది. MediaTek Dimensity 9400e ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ Realme GT 7.
కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ లో Realme GT 7 ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ Sony IMX906 1.56-అంగుళాల కెమెరా, 50-మెగాపిక్సెల్ S5KJN5 టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ OV08D10 అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా యూనిట్ 120fps వద్ద 4K స్లో మోషన్ వీడియో రికార్డింగ్‌కు సపోర్టు చేస్తుంది. అయితే ముందు కెమెరా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మాత్రమే సపోర్టు చేస్తుంది.
Realme GT 7 లోని కనెక్టివిటీ గురించి.. బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ GPS, NFC ,Wi-Fi 7 ఉన్నాయి. దీనికి IP69 రేటింగ్ డస్ట్, వాటర్ ఫ్రూఫ్ సిస్టమ్ ఉంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్లో AI గ్లేర్ రిమూవల్, AI ల్యాండ్‌స్కేప్+ , AI ట్రాన్స్‌లేటర్ వంటి అనేక AI- ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మీ GT 7 లో ఛార్జింగ్ ..120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7,000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ 40 నిమిషాల్లో 1 శాతం నుంచి100 శాతం వరకు బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది. ఇది మదర్‌బోర్డ్‌కు నేరుగా శక్తిని సరఫరా చేసే స్మార్ట్ బైపాస్ ఛార్జింగ్ పద్ధతిని అందిస్తుంది. ఈ సిస్టమ్ అధిక-ఉష్ణోగ్రత ,గేమింగ్ సమయంలో బ్యాటరీ వేర్‌ను తగ్గిస్తుంది.
Realme GT 7T స్పెసిఫికేషన్లు
Realme GT 7T స్మార్ట్ ఫోన్ GT 7 మాదిరిగానే SIM, సాఫ్ట్‌వేర్, సెల్ఫీ కెమెరా, బ్యాటరీ , ఛార్జింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది.ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ,360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.80-అంగుళాల AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉటుంది. ఈ డివైజ్ లో 12GB RAM , 512GB వరకు నిల్వతో MediaTek Dimensity 8400-Max చిప్‌సెట్‌తో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 1.56-అంగుళాల ప్రధాన సెన్సార్ కెమెరా, 8-మెగాపిక్సెల్ OV08D10 అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది. కనెక్టివిటీకోసం బ్లూటూత్ 6, డ్యూయల్-బ్యాండ్ GPS, NFC , Wi-Fi 6 ఉన్నాయి.Realme GT 7T ఛార్జింగ్.. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీఉంటుంది. Realme GT 7 , GT 7T రెండు స్మార్ట్ ఫోన్లు నాలుగు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు ,ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేషన్లను అందిస్తుంది.
Realme GT 7 డ్రీమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
రియల్‌మీ GT 7, GT 7T లతో పాటు ప్రత్యేక GT 7 డ్రీమ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఆస్టన్ మార్టిన్ అరాంకో ఫార్ములా వన్ టీమ్‌తో కలిసి కంపెనీ రూపొందించింది. ఇది ఆస్టన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రీన్ కలర్, వెనక భాగంలో సిల్వర్ వింగ్ లోగో ఉంటుంది.
రియల్‌మే GT7 డ్రీమ్ ఎడిషన్‌లో F1 రేస్‌కార్ సిమ్ కార్డ్ పిన్ ,ఆస్టన్ మార్టిన్ F1 రేస్‌కార్లను పోలి ఉండే సిల్వర్ వింగ్ ఫోన్ కేసుతో ప్రత్యేక బాక్స్ వస్తుంది. ఇది కస్టమ్ వాల్‌పేపర్‌లు, చిహ్నాలు ,థీమ్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్‌మే జిటి 7 స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే 16 GB RAM 512 GB స్టోరేజ్ ప్యాక్ తో వస్తుంది