రీ-–ఇన్ఫెక్షన్​ ఇందుకే

రీ-–ఇన్ఫెక్షన్​ ఇందుకే

మాస్క్​ పెట్టుకోనివాళ్లు, మందిలో తిరిగేవాళ్లలో చాలామంది రీ–ఇన్ఫెక్షన్​ బారిన పడుతున్నారు. అయితే, వ్యాక్సిన్​ రెండు డోసులు వేసుకున్నవాళ్లకు, బూస్టర్​ డోస్ తీసుకున్నవాళ్లకు కూడా కరోనా రీ–ఇన్ఫెక్షన్ వస్తోంది. తొందరగా, ఈజీగా వ్యాపించే  ఒమిక్రాన్​తో పాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా  కారణం. కరోనా నుంచి కోలుకున్నవాళ్లలో యాంటీబాడీస్​ దాదాపు ఐదు నెలలు యాక్టివ్​గా ఉంటాయి. ఆ తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుంది. దాంతో ఈ కొత్త వేరియెంట్ ​వేగంగా వ్యాపిస్తోంది. అయితే, ఒమిక్రాన్​ రీ–ఇన్ఫెక్షన్ గురించి సైంటిఫిక్​ డేటా ఇంకా రాలేదు. 


రీ–ఇన్ఫెక్షన్​ రాకుండా...


ఆఫీసు లేదా ఇతర పనులకు బయటికి వెళ్లేవాళ్లు కరోనా జాగ్రత్తలు పాటించాలి. 15 ఏండ్లు దాటిన వాళ్లతో సహా ఇంట్లోవాళ్లందరూ వ్యాక్సిన్​ వేసుకోవాలి. రెండో డోస్​ వేసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్​ డోస్​  వేసుకోవాలి. అయితే, డాక్టర్​ని సంప్రదింతించిన తర్వాత వేసుకుంటే మంచిది. కరోనా వచ్చి, హోమ్​ ఐసోలేషన్​లో ఉండేవాళ్లు ఇంట్లోవాళ్లకి 6 అడుగుల దూరం ఉండాలి. అంతేకాదు ఇంట్లోనే ఉన్నాకూడా ఫ్యామిలీ అంతా మాస్క్​ పెట్టుకోవాలి. 
 

ఇమ్యూనిటీ కోసం...

కరోనా టైమ్​లో శారీరకంగా, మానసికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకోసం రోజూ వర్కవుట్స్​తో పాటు కొంచెం సేపు యోగ, ధ్యానం చేయాలి. ఇమ్యూనిటీ కోసం వంటల్లో పసుపు, నల్లమిరియాలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వంటి మసాలా దినుసులు తప్పనిసరిగా వేయాలి. నిమ్మజాతి పండ్లు, నట్స్​, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్​ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. కెఫిన్​ ఉండే కాఫీ లాంటి డ్రింక్స్​ బదులు హెర్బల్​ టీ తాగితే హెల్త్​కి మంచిది. కరోనా నుంచి కోలుకున్నవాళ్లు బ్రీతింగ్​ కెపా సిటీ పెంచుకోవడానికి ఎక్సర్​సైజ్​లు చేయాలి. 

ఇవి కూడా చదవండి: 

ఆధార్ తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ