జగిత్యాల జిల్లాలో భారీగా క్యాష్​ పట్టివేత.. ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

జగిత్యాల జిల్లాలో భారీగా క్యాష్​ పట్టివేత.. ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయిపోతున్నాయో చెప్పడానికి తెలంగాణ ఎన్నికలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులకు భారీగా నగదు, బంగారు, వెండి, లిక్కర్ దొరుకుతోంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ క్షణం నుంచి పోలీసులు కూడా డబ్బుల పంపిణీ, ఇతర ప్రలోభాలపై దృష్టి పెట్టారు. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి వారం రోజులకుపైగా అవుతుంది. ఈ వారంలో రోజుల్లో లెక్కల్లోకి రాని నగదు, ఇతర సొత్తు భారీగానే పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నలువైపుల మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా సొత్తు లభిస్తోంది. 

తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం దొంగల మర్రి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ సందర్భంగా రాత్రి ప్రత్యేకంగా వాహనాలను తనిఖీలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న  ఒక లక్ష  21 వేల 400 రూపాయల క్యాష్​ ను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ధర్మపురి మండలం రాయపట్నం చెక్ పోస్ట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న  ఒక లక్ష 13 వేల 700 రూపాయల నగదును సీజ్ చేశారు.