ఈ నెల 31 వరకు ఎర్రకోట బంద్

ఈ నెల 31 వరకు ఎర్రకోట బంద్

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటలో విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు నిరసనకారులు ఎర్రకోటలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ ఘటనలో 300 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి.

హస్తినలో ఇంకా హై-టెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు మూసేసి ఉంచనున్నారు. అప్పటివరకు రెడ్‌‌ఫోర్ట్‌‌కు సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌‌ఐ) బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ఎర్రకోటను మినిస్టర్ ఆఫ్ కల్చర్, టూరిజం ప్రహ్లాద్ సింగ్ పటేల్ బుధవారం విజిట్ చేశారు. నిరసనకారుల దాడిలో ఎర్రకోటలో జరిగిన నష్టానికి సంబంధించి రిపోర్టును రూపొందించాల్సిందిగా ఏఎస్‌ఐని ఆదేశించారు. అలాగే నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.