జొమాటో రైడర్లందరికి రెడ్ యూనిఫామే

జొమాటో రైడర్లందరికి రెడ్ యూనిఫామే

న్యూఢిల్లీ: శాకాహారుల కోసం మాత్రమే జొమాటో తీసుకొచ్చిన కొత్త  సర్వీస్‌‌ను చాలా మంది పొగుడుతుండగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు. దీంతో  తమ డెలివరీ పార్టనర్లందరూ రెడ్ యూనిఫామ్‌‌ను  మాత్రమే ధరిస్తారని జొమాటో సీఈఓ దీపిందర్‌‌‌‌ గోయెల్ ప్రకటించారు.

ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్‌‌ను డెలివరీ చేసే వారు గ్రీన్ యూనిఫామ్‌‌ వేసుకుంటారని మంగళవారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.