రెడ్ మీ నుంచి కొత్త ఫోన్ : 5G ఫీచర్స్‪తో సూపర్

రెడ్ మీ నుంచి కొత్త ఫోన్ : 5G ఫీచర్స్‪తో సూపర్

ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన రెడ్ మీ నోట్ 13 ప్రో, మొబైల్స్ కు మంచి రెస్‍పాన్స్ లభించింది. అయితే షావోమీ రెడ్మీ కంపెనీ మరో కొత్త మోడల్ మొబైల్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. రెడ్ మీ 13 5Gను జూలై 12న లాంచ్ చేయనుంది. ఆ కొత్త ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఒక లుక్ వేద్దాం..

రెడ్ మీ 13 5G స్పెసిఫికేషన్స్  ఇలా ఉన్నాయి

  • 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీ.
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
  • 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE SoCపై రన్ అవుతుంది. 
  • 108 మెగా పిక్సల్ శామ్‌సంగ్ ISOCELL HM6 సెన్సార్ కెమెరా, 13- మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
  • 6.79- ఇంచెస్ ఫుల్ -HD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది.

Redmi 13 5G ఫోన్ హవాయి బ్లూ, బ్లాక్ డైమండ్, ఆర్చిడ్ పింక్ మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. దీని ధర 6GB + 128GB RAM స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.13వేల 999 మరియు 8GB + 128GB వేరియంట్ కోసం రూ.15వేల 499 బ్యాంక్ ఆఫర్‌లు లేదా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ తో రూ.వేయి తగ్గింపు కూడా ఉంది.

ALSO READ | ఇండియాలోకి వచ్చేసిన CMF ఫోన్.. ధర ఎంతంటే..?