పెనుబల్లి మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో పేలిన ఫ్రిడ్జ్..రూ.5 లక్షల ఆస్తి నష్టం

 పెనుబల్లి మండల కేంద్రంలో  షార్ట్ సర్క్యూట్ తో పేలిన ఫ్రిడ్జ్..రూ.5 లక్షల ఆస్తి నష్టం

పెనుబల్లి, వెలుగు : షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలడంతో ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయిన ఘటన పెనుబల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పానేం వెంకటేశ్వరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలిపోయింది. వెంటనే ఇంట్లో ఉన్న సామాన్లకు మంటలు అంటుకుని చాలా వరకు కాలిపోయాయి. 

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే  ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలు అదుపు చేయడంతో భారీ నష్టం తప్పింది. అయినా అప్పటికే రూ.5లక్షలు విలువ చేసే ఇంట్లోని సామగ్రి కాలిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఆకస్మాత్తుగా ఇంట్లో మంటలు!

ఖమ్మం టౌన్ : ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన ఖమ్మం సిటీలోని బుర్హాన్ పురంలో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబ తెలిపిన వివరాల ప్రకారం..  బుర్హాన్ పురం లోని టీచర్​ నారాయణరావు ఇంటిలో శుక్రబారం భార్య, కొడుకుతో ఉన్నాడు. ఒక్కసారిగా ఇంట్లో పై కప్పు సీలింగ్ కూలింది. వెంటనే ఇంట్లోఏని బట్టలకు నిప్పంటుకుంది.

 వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారు ముగ్గురు ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ఇంట్లో పేలిన శకలాలు పక్కన  ఉన్న ఇండ్లపై పడ్డాయి. వెంటనే ఫైర్​ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని, షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగి ఉంటుందని ఇంటి ఓనర్ నారాయణరావు చెప్పారు.