పిట్టల్ని చూస్తూ రిలాక్స్ అవ్వండి

పిట్టల్ని చూస్తూ రిలాక్స్ అవ్వండి

జో హార్క్‌ నెస్‌ తాగుడుకి బానిసయ్యాడు. ఎప్పుడూ సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తుండేవాడు. ఆరేళ్ల కింద అకస్మాత్తుగా అతని మానసిక ఆరోగ్యం
ప్రమాదకరంగా మారింది.మెడిసిన్స్, కౌన్సెలింగ్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పడం మొదలు పెట్టింది అతని భార్య. ‘జో హర్క్‌ నెస్‌ మళ్లీ మామూలు మనిషి అవుతాడనుకోలేదామె. 2013లో ఒకసారి భార్యతో కలిసి అతను అవుట్‌ డోర్‌‌‌‌‌‌‌‌ వాకింగ్‌ కి వెళ్లాడు. అక్కడ పక్షులను చూస్తూ ఓదార్పు, రిలీఫ్ పొందాడు. ‘ ప్లీజ్‌ డియర్‌‌‌‌‌‌‌‌! రోజూ బర్డ్‌ వాచింగ్‌ కి వెళదాం ’ అని ఆమెకు చెప్పాడు. ఆమె ‘సరే’ అన్నది. కొన్నాళ్లకు అతను మామూలు మనిషయ్యాడు. ఇదంతా పక్షుల వల్లే సాధ్యం అయిందంటాడు జోహార్క్‌ నెస్‌ ! అంతేనా.. ఓ అడుగు ముందుకేసి ‘బర్డ్‌ థెరపీ’
పేరుతో బుక్‌‌‌‌ కూడా రాశాడు.

ఆ రోజు పక్షులను చూసిన అనుభూతిని మర్చిపోలేను. అప్పుడు నేను రెండు జంట డేగలను చూశాను. అందులో ఒక డేగ చూలుతో ఉంది. మరో డేగ దాని పట్ల తీసుకుంటున్న కేరింగ్‌ ని, సంతోషంతో కూడిన ప్రవర్తనని చూస్తూ అలా ఉండిపోయాను. నాకు ఇంకా గుర్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత నాకు పక్షులను పరిచయం చేశాడు. ఆ డేగ జంటను చూడగానే ఆ జ్ఞా పకాలన్ని ఒక ప్రవాహంలా నన్ను తాకాయి’ అని అంటాడు జో హార్క్‌ నెస్‌.

ఎంత అందమో?

మందులు, కౌన్సెలింగ్‌ కొంతవరకు అతని మానసిక ఆరోగ్యాన్ని దారిలో పెట్టగలిగాయి. కానీ, నేచర్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టు ఫీల్‌ కావడానికి అతనికేదీ సాయం చేయలేదట. ముఖ్యంగా పక్షులను చూస్తూ గడపడం వల్లే ఫస్ట్ టైం ఆ ఫీలింగ్‌ కలిగిందని చెప్తాడు జో హార్క్‌ నెస్‌. ‘ఒకసారి డేగలు అటు వెళ్లగానే.. పిచ్చుక వచ్చి వాలింది. దాని వెనకే వందలాది పిచ్చుకలు వచ్చి వాలాయి. పచ్చికబయళ్లలో నా ముందు పెరేడ్ చేయడం మొదలు పెట్టాయి. అప్పటి వరకు నేను అంత అందమైన దృశ్యాన్ని చూడలేదు’ అంటాడు జోహార్క్‌ నెస్‌. ‘ తర్వాత ఒక్కొక్క పక్షిని చూసే కొద్దీ.. నా జీవితం మరింత రియలిస్టి క్‌ గా మారిందటాడాయన. పక్షులు వలస పోతాయి. కొన్ని పక్షులు వలస వస్తాయి. పక్షులు ఏవైనా.. మనకి సంతోషం కలిగిస్తాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికా నుంచి వచ్చిన వలస పక్షులు నా హెల్త్‌‌‌‌ని సెట్‌ చేయడంలో బాగా ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నాడు జో.

బర్డ్‌ థెరపీ బ్లాగ్‌

‘అరె! పక్షుల్లో ఇంత అద్భుతమైన శక్తి ఉంది. మనుషుల్లో ఉన్న ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేసేందుకు నేచర్‌‌‌‌‌‌‌‌ ఇలా కూడా మనకు అవకాశం కల్పించింది’ అని జో హార్క్‌ నెస్‌ కి పక్షులపై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. బ్రిటన్‌ లోని న్యూఫోల్క్‌ లో ఉన్న టీచర్స్‌‌‌‌కి దీని గురించి ‘స్పె షల్ ఎడ్యు కేషన్‌ ’ అందించాలనుకున్నాడు. లోకల్‌ ఫోరమ్స్‌‌‌‌లో కలిసి పని చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ‘బర్డ్ థెరపీ’ గురించి అందరికీ తెలియజేయడానికి ఆన్‌ లైన్‌ బ్లాగ్‌ స్టార్ట్ చేశాడు. పక్షులను చూస్తూ తాను ఎలా రికవరీ అయ్యాడు? పక్షులు ఎలా మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి? అనే విషయాలు
అందులో రాసేవాడు. తక్కువ టైంలోనే ఆ బ్లాగ్‌ ని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య పెరిగి పోయింది. అది మెయిన్‌ స్ట్రీమ్‌‌‌‌ మీడియాను కూడా ఎట్రాక్ట్ చేసింది.

స్ట్రెస్‌ తగ్గుతుంది

పచ్చని ప్రదేశాల్లో గడిపితే.. బీపీ లెవల్స్‌‌‌‌ తగ్గుతాయి. అంతేకాదు స్ట్రెస్‌ హార్మోన్ కార్టిసోల్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోతుందని స్టాన్‌ ఫర్డ్‌‌‌‌ యూనివర్సిటీ చేసిన ఓ స్టడీలో తేలింది. ‘రోజూ 90 నిమిషాలు పల్లెటూళ్లలో లేదా పచ్చిక బయళ్లలో నడిస్తే.. బ్రెయిన్‌ లో ఉండే ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌‌‌‌లో యాక్టివిటీ
తగ్గుతుంది. దీనివల్ల నెగెటివ్‌ ఎమోషన్స్‌‌‌‌ గురించి పదేపదే ఆలోచించడం తగ్గిపోతుంది’ అని ఆ పరిశోధకులు తేల్చారు. ‘ డిప్రెషన్‌ వల్ల ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌‌‌‌లో మాల్‌ ఫంక్షన్స్‌‌‌‌ జరుగుతాయి. దీని వల్ల నెగెటివ్ ఆలోచనలు పుడుతుంటాయి. అవుట్‌ డోర్‌‌‌‌‌‌‌‌లో గడపడం వల్ల ఈ నెగెటివ్ ఆలోచనలకు బ్రేక్ వేయొచ్చని చెప్పారు . ‘అవుట్‌ డోర్‌‌‌‌‌‌‌‌కి వెళితే కేవలం పక్షులను మాత్రమే చూడం కదా! స్వచ్ఛమైన గాలిని పీలుస్తాం. పక్షులు పాడే పాటలు
వింటాం. నది మీద నుంచి సూర్యు డు ఉదయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ పక్షులు పాడే పాటలు వింటున్నప్పుడు నాకు ఈ లోకాన్ని గెలి చినట్టు
అనిపిస్తుంది. ఇంతకు మించి నాకేం వద్దు’ అంటాడు జోహార్క్‌ నెస్‌.

డబ్బులు అవసరం లేదు

‘ఎన్విరాన్‌ మెంట్‌ ని కాపాడాల్సిన అవసరం ఉంది. తగ్గిపోతున్న పక్షుల గురించి ఆలోచిస్తే.. భయం వేస్తోంది. ప్రకృతే సౌకర్యాలకు మూల
వనరు. మనిషి కోరుకు నేది కూడా సౌకర్యాలనే! అయితే, ఇప్పుడు తన సౌకర్యాలను తానే నాశనం చేసుకుంటున్నాడు. రోజంతా ఎంత భారంగా,
కష్టం గా గడిచినా.. ఇంటికి తిరిగొచ్చాక.. గార్డెన్‌ లో పక్షులను చూడగానే నాకు సంతోషం కలుగుతుంది. ఆ బాధలన్నీ మర్చిపోతాను’ అని తన పుస్తకంలో ఒక చోట రాశాడు జో. ఇప్పుడు అక్కడ చాలామంది ‘బర్డ్‌‌‌‌ థెరపీ’ ట్రై చేస్తున్నారు . పక్షులను చూసినప్పుడు వాళ్లలో కలిగే అనుభూతుల్ని , ఆనందాల్ని షేర్ చేసుకుంటున్నారు. ‘‘ఈ థెరపీకి డబ్బులు కూడా అవసరం లేదు. ఇది కంప్లీట్‌ గా ఫ్రీ థెరపీ! ఎవరికి వారు ‘బర్డ్‌‌‌‌థెరపీ’ చేసుకోవచ్చు’’ అంటాడు జోహార్క్‌ నెస్.

బర్డ్‌ వాచిం గ్‌ అంటే
బర్డ్‌‌‌‌ వాచింగ్‌ కాన్సెప్ట్‌‌‌‌కి, మైండ్‌‌‌‌ఫుల్‌ నెస్ కాన్సెప్ట్‌‌‌‌కి పోలికలున్నాయి! జోహార్క్‌ నెస్‌ బర్డ్‌‌‌‌థెరపీ బర్డ్‌‌‌‌వాచింగ్‌ అంటే ఏం చేయాలి అంటే..
ముందు మీ గార్డెన్‌ లోగానీ, మీకు దగ్గరలో ఉన్న అవుట్‌ డోర్ స్పే స్‌ లో గానీ ఏ పక్షులు ఉన్నాయి? అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి? అని తెలుసుకోవాలి. దీన్ని నేను బర్డ్ కమ్యూనిటీ అంటాను. ‘బ్రిటన్‌ లోని రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్‌ బర్డ్స్‌ ’ ( ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌ పీబీ) పక్షులకు
ఏం ఫీడ్ చేయాలో అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్తుంది. చాలామంది వాటికి గింజలు వేస్తూ సేద తీరుతారు. పక్షులను చూసేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. కాన్షియస్‌ గా ఉండాలి. రోజూ మన చుట్టూ ఉండే పక్షుల రెక్కల్ని, ఈకల్ని గమనించాలి. వాటి అందం మైమరిపిస్తుంది. దాని వల్ల తెలియని అనుభూతి ఒకటి మనసు లోతులకు పాకు తుంది. కేవలం పక్షులను చూడటంపైనే ఫోకస్‌ పెట్టడానికి ట్రై చేయొద్దు. వాటి కిల కిలలను వినాలి. కూతలు, పాటలు సంతోషం కలిగిస్తాయి. లోకల్‌ గా పక్షులు ఎక్కడ ఎక్కువ ఉంటాయో ముందు తెలుసుకొని..రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా అక్కడికెళ్లి చూస్తుండాలి. ఇది తమను తాము నేచర్‌‌‌‌‌‌‌‌తో కనెక్ట్‌‌‌‌ చేసుకునేందుకు మంచి దారి.