బీఎస్ఎఫ్ లో 2788 కానిస్టేబుల్స్‌ 

బీఎస్ఎఫ్ లో 2788 కానిస్టేబుల్స్‌ 

హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‍ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‍ఎఫ్‍) 2788 కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్‍ ఎఫీషియన్సీ టెస్టు, రాతపరీక్ష ద్వారా ఎంపిక చేసే ఈ పరీక్షలో సెలెక్ట్ అయితే దేశ సేవ చేయడంతో పాటు మంచి కెరీర్​ సొంతం చేసుకోవచ్చు.

ఫిట్​నెస్​ ఉండి పదో తరగతి పాసైన అభ్యర్థులకు ఆర్మీలో పనిచేసే మంచి అవకాశం బీఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ నోటిఫికేషన్​. ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్​ కొనసాగిస్తూ ఫిజికల్​ ఈవెంట్స్​ మీద ఫోకస్​ చేస్తే పరీక్షలో విజయం సాధించడం సులువే. దేశ రక్షణలో సేవలు అందించాలనుకునే నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్​ ముఖ్యమైంది. 

మొత్తం ఖాళీలు: 2788 (పురుషులు - 2651, మహిళలు-137), పోస్టులు–ఖాళీలు: కాబ్లర్‌‌‌‌ - 91 (పురుషులు - 88, మహిళలు-3), టైలర్‌‌‌‌: 49  (పురుషులు - 47, మహిళలు-2), కుక్‌‌‌‌: 944 (పురుషులు - 897, మహిళలు - 47), డబ్ల్యూ/సీ: 537 (పురుషులు - 510, మహిళలు - 27), డబ్ల్యూ/ఎం: 356 (పురుషులు - 338, మహిళలు - 18), బార్బర్‌‌‌‌: 130 (పురుషులు - 123, మహిళలు - 7); స్వీపర్‌‌‌‌: 637 (పురుషులు - 617, మహిళలు - 20), కార్పెంటర్‌‌‌‌: 13, పెయింటర్‌‌‌‌: 3, ఎలక్ట్రీషియన్‌‌‌‌: 4,  డ్రాఫ్ట్స్‌‌‌‌మెన్‌‌‌‌: 1, వెయిటర్‌‌‌‌: 6, మాలి: 4.సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను  ఎంపిక చేస్తారు.


ఫిజికల్​ ఎఫీషియెన్సీ టెస్ట్ ​

 పురుషులకు 5 కిలోమీటర్ల పరుగు ఉంటుంది. దీన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులు 1.6 కిలోమీటర్లు 8.30 నిమిషాల్లో పరుగెత్తాలి. 

రాతపరీక్ష

రాతపరీక్ష ఆబ్జెక్టివ్ టైప్​లో ఉంటుంది. క్వశ్చన్​ పేపర్​ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులు ఉంటాయి. రెండు గంటల్లో పరీక్ష పూర్తి చేయాలి.
         
నోటిఫికేషన్​
అర్హత: పదో తరగతి/ తత్సమాన  ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి.వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 

సాలరీ: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-3లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌‌‌‌మెన్) పోస్ట్‌‌‌‌లో నియమిస్తారు. పే స్కేల్- 21,700 -రూ. 69,100, కేంద్ర ప్రభుత్వ ఇతర అలవెన్స్‌‌‌‌లు అందజేస్తారు.
దరఖాస్తులు: మార్చి 1వ తేదీ లోపు ఆన్‌‌‌‌లైన్​లో అప్లై చేసుకోవాలి.

వెబ్​సైట్​: www.rectt.bsf.gov.in
సబ్జెక్ట్​    ప్రశ్నలు    మార్కులు
జనరల్​ అవేర్​నెస్​    25    25
మ్యాథమెటిక్స్    25​    25
ఆప్టిట్యూడ్    25​    25
బేసిక్​ ఇంగ్లిష్​    25    25
మొత్తం    100    100