సాగర్‌‌ ఎడమ కాల్వకు నీటి విడుదల..ఖమ్మం తాగునీటి అసరాలకు 3 వేల క్యూసెక్కులు

సాగర్‌‌ ఎడమ కాల్వకు నీటి విడుదల..ఖమ్మం తాగునీటి అసరాలకు 3 వేల క్యూసెక్కులు

హాలియా, వెలుగు : ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్‌‌ ఎడమ కాల్వ నుంచి నీటి విడుదలను ప్రారంభించారు. మూడు వేల క్యూసెక్కుల నీటిని పాలేరు రిజర్వాయర్‌‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌ ఎడమకాల్వ హెడ్‌‌ రెగ్యులేటరీ వద్ద ఎన్ఎస్పీ అసిస్టెంట్ ఇంజనీర్లు కృష్ణయ్య, విజయ్‌‌కుమార్‌‌ శుక్రవారం స్విచ్‌‌ ఆన్‌‌ చేసి గేట్‌‌ను ఎత్తారు. నాలుగు రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని ఆఫీసర్లు ప్రకటించారు.